శ్రీ‌దేవి కూతురికి రైతులు ఊహించ‌ని షాక్‌.. ఏం జ‌రిగిందంటే?

January 25, 2021 at 8:28 am

అతిలోక సుందరి, ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ధడక్` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిందిజాన్వీ. ఈ సినిమా ద్వారా అందంతో పాటు అభినయంతోనూ జాన్వీకపూర్ ఆక‌ట్టుకుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో బిజీగా మారింది ఈ బ్యూటీ.

అయితే తాజాగా జాన్వీ క‌పూర్ రైతులు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఆమె న‌టిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ జెర్రీ’. ఈ సినిమా షూటింగ్ పంజాబ్‌ పటియాలాలో జ‌రుగుతోంది. అయితే పంజాబ్‌లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ప్రభావం ఈ సినిమా షూటింగ్‌పై ప‌డింది. తాజాగా చిత్రీకరణ స‌మ‌యంలో జాన్వీకపూర్‌ను మ‌రియు యూనిట్‌ను రైతులు చుట్టుముట్టారు.

షూటింగ్‌ ఆపి వెనక్కు వెళ్లాలని పంజాబ్‌ రైతులు నిరసన తెలిపారు. దీంతో చేసేదేమి లేక జాన్వీ మ‌రియు యూనిట్ స‌భ్యులు షూటింగ్‌ ఆపి తాముంటున్న హోటల్‌కు తిరిగొచ్చారు. అయితే అక్కడకూ చేరుకున్న రైతులు హోటల్‌ ముందు ధర్నా చేశారు. ‘జాన్వీ వెనక్కు వెళ్లిపోవాలి’ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రైతుల‌తో చ‌ర్చ‌లు ప్రారంభింఆచ‌రు.

శ్రీ‌దేవి కూతురికి రైతులు ఊహించ‌ని షాక్‌.. ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts