
`ఇస్మార్ట్ శంకర్` సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యారర్ ఫై పూరీ, ఛార్మీ కౌర్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత పూరీ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ ఇలాంటి పేర్లు వినిపించినా.. దేనిపైనా క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ లిస్ట్‌లో మరో సీనియర్ స్టార్ హీరో పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆ సీనియర్ హీరో ఎవరో కాదు.. కింగ్ నాగార్జున. పూరీ జగన్నాథ్, నాగార్జున కాంబినేషన్ లో గతంలో సూపర్, శివమణి సినిమాలు వచ్చి.. మంచి విజయం సాధించాయి.
ఈ క్రమంలో ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కానుందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లాక్డౌన్ టైంలో పూరీ నాగార్జున కోసం ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ రాసుకున్నారట. ఫాంటసీ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా సాగుతుందని టాలీవుడ్ లో ప్రచారం నడుస్తోంది. అయితే ఈ సినిమాకు నాగ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారా.. లేదా.. అన్నది చూడాలి.