జంతువులు, పక్షుల గొంతుతో సారే జహాసే అచ్చా.. వీడియో వైరల్

January 27, 2021 at 3:36 pm

మంగళవారం దేశవ్యాప్తంగా ప్రజలు 72 వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇక కోవిడ్ క్రమంలో ఢిల్లీలోని రాజ్ పథ్ లో నిర్వహించిన కార్యక్రమాలు, సైనికుల విన్యాసాలు, శకటాల ప్రదర్శన ఆహుతులను అందరిని అమితంగా ఆకట్టుకునాయి. ఇదే క్రమంలో భారత్ కు చెందిన ఏ -కాపెల్ల బృందం, రాగా ట్రిప్పిన్ మాత్రం గణతంత్ర దినోత్సవాన్ని డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసింది. భారత్ లో ఉన్న జంతువులు, పక్షులు చేసే శబ్దాలతో సారే జహాసే అచ్చా ను రూపొందించింది.

ఎటువంటి వాయిద్యాలు వాడకుండా సంగీతాన్ని అందించడంలో ఈ బృందం ఖ్యాతి పొందింది. ఇక పోతే ఈ పాటను నెమళ్లు, ఏనుగులు, కోతులు, సింహాలు, చింపాంజిలు చేసే శబ్దాలతో రూపొందించడం విశేషం. ఏ కాపెల్ల బృందం చేసిన ఈ వీడియో సాంగ్ ఇప్పుడు బాగా వైరల్ అయింది. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ పాటలో వినిపించే నెమళ్లు, సింహం, ఏనుగు, కోతుల శబ్దం వాటి ఒరిజినల్ వాయిస్ కాదు. ఈ బృందంలోని సభ్యులే వాటిని అనుకరిస్తూ పాట పాడారు. అలన్ డిసౌజా, గేరీ మిస్కిట్టా, గ్వేన్ డయాస్, కేశియా బ్రంజ, సుజన్నే డెమొల్లో, థామ్సన్ ఆండ్రూస్ లతో కూడిన ఏ కాపెల్ల బృందం ఈ గీతాన్ని రూపొందించింది.

జంతువులు, పక్షుల గొంతుతో సారే జహాసే అచ్చా.. వీడియో వైరల్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts