క‌రోనాపై రాచ‌కొండ సీపీ వినూత్న ప్ర‌చారం

January 3, 2021 at 10:40 am

కరోనా వైర‌స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ వినూత్న ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌తి ఒక్క‌రూ ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని సీపీ సూచిస్తున్నారు. క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు H ఫౌండేషన్ న‌గ‌రంలోని ఉప్పల్ సర్కిల్ నుంచి 10 km రన్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరైన రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజ‌రై జెండా ఊపి 10k రన్‌ను ప్రారంభించారు. అనంత‌రం సీపీ మాట్లాడుతూ అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాల‌ని సూచించారు. కేసులు చాలా వరకు తగ్గాయ‌ని, అయిన‌ప్ప‌టికీ మళ్ళీ కొత్త కేసులు వస్తున్నాయ‌ని హెచ్చ‌రించారు.

పోలీసు సిబ్బందిలో 1058 మంది కరోనా బారిన ప‌డ్డార‌ని, అంద‌రూ క్యూర్ అయ్యార‌ని వెల్ల‌డించారు. అందరి జీవితంలో S-శానిటైస‌ర్‌, M-మాస్క్‌, S-సోష‌ల్ డిస్టెన్స్‌ భాగం కావాల‌ని పిలుపునిచ్చారు. 10కే ర‌న్‌ను ఏర్పాటు చేసిన హెచ్‌ ఫౌండషన్ స‌భ్యుల‌ను అభినందించారు. లాక్ డౌన్ టైమ్ లో కూడా సేవ కార్యక్రమాలు చేశార‌ని ప్ర‌శంసించారు సీపీ. ఇదిలా ఉండ‌గా 10కే ర‌న్ కు భారీగా యువ‌కులు త‌ర‌లివ‌చ్చారు. సుమారు 1000 మంది వ‌ర‌కు ర‌న్‌లో పాల్గొన్నారు. ర‌న్ నేప‌థ్యంలో ఉప్పల్ సర్కిల్ వ‌ద్ద ట్రాఫిక్ మల్లింపు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు అధికారులు.

క‌రోనాపై రాచ‌కొండ సీపీ వినూత్న ప్ర‌చారం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts