
బిగ్‌బాస్ రియాలిటీ షో తర్వాత దశ తిరిగిపోయిన కంటెస్టెంట్స్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ముందు ఉన్నాడు. బిగ్‌బాస్ మూడో సీజన్ విజేతగా నిలిచిన ఆయనకు ఆ షో నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే ఎన్నో ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఈ క్రమంలో రంగమార్తాండ మూవీలో నటించే అవకాశం రావడంతో సింగర్ రాహుల్ కాస్త యాక్టర్ రాహుల్‌గా మారాడు. ఈమధ్యే బిజినెస్‌మెన్‌గానూ అవతారమెత్తాడు. తెలంగాణ యాసలో పాటలు పాడుతూ ఫేమస్ అయిన రాహుల్ ఇప్పుడు అదే యాసలోని డిఫరెంట్‌గా పేరు పెట్టి కొత్త బిజినెస్ ప్రారంభించాడు. ఊకో కాకా అనే పేరుతో బట్టల వ్యాపారం మొదలు పెట్టాడు. ఈ మధ్యే కరీంనగర్లో మొదటి షోరూమ్‌ను ప్రారంభించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే జోష్‌లో నేడు సాయంత్రం హైదరాబాద్‌లో కూడా కొత్త స్టోర్ తెరుస్తున్నాడు. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అషూ రెడ్డి కూడా రానుంది. ఈ విషయాన్ని రాహుల్ తన ఫాన్స్ కు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
నీ బలహీనతలు తెలిసినా కూడా బలాన్ని మెచ్చుకునే వాళ్లే అసలైన స్నేహితులు.
ఊకో కాకా స్టోర్ ప్రారంభించేందుకు విచ్చేస్తున్న అషుకు ఘాన స్వాగతం. ఇప్పుడు నాకింకా ధైర్యం వచ్చింది అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసు కొచ్చాడు. అయితే ఈ పోస్టుకు అషును ఎత్తుకున్న ఫొటోను జత చేశాడు. దీనితో అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. వీళ్ల వాలకం చూస్తుంటే కుచ్ కుచ్ హోతా హై అనిపిస్తోందని కొందరు నెటిజన్స్ గుస గుసలాడుతున్నారు. దీనిలో తప్పేముందని ఆయన వీరాభిమానులు రాహుల్ ని వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే తమది మంచి ఫ్రెండ్షిప్పే అన్నట్లుగా పోస్ట్ పెట్టాడు రాహుల్.