
టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. వరుస మూవీ ఆఫర్స్‌తో దూసుకెళుతున్న అందాల భామ రకుల్ ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస చిత్రాలు చేస్తుంది. ప్రస్తుతం రకుల్ తెలుగులో నితిన్ చెక్ మూవీలో నటిస్తోంది. అలాగే తమిళ్లో కమల్ హాసన్ సరసన ఇండియన్ 2, శివ కార్తికేయన్ అలయాన్లో నటిస్తున్నారు. వీటితో పాటు హిందీలో సర్దార్ అండ్ గ్రాండ్సన్, అటాక్, మేడే సినిమాలో చేస్తుంది. ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన సినిమాలో కూడా రకుల్ నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఫిట్ నెస్ విషయంలో ఎంత మాత్రం రాజీపడని రకుల్ ప్రీత్ సింగ్ తరచు వర్కవుట్స్ చేస్తూ ఆ వర్కవుట్ కు సంబంధించిన వీడియోలను తన అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్‌ని ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. తాజాగా జిమ్‌లోని ఓ వీడియోని షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి వాటిని నేను స్క్వాట్స్ అని పిలుస్తాను అంటూ బర్న్, స్ట్రాంగ్ ఈజ్ ద న్యూ సెక్సీ, ఫిట్నెస్ ఎంథూజియాస్ట్ అని హ్యాష్‌ట్యాగ్‌లు జత చేసి పెట్టింది. జిమ్‌లో రకుల్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.