ఆ స్టార్ హీరోతో డీల్ కుదుర్చుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌!

January 23, 2021 at 9:58 am

ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కేరటం` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ర‌కుల్‌.. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ఇక ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా కాస్త స్లో అయిన ర‌కుల్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చి తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ ఇలా అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

ఈ క్ర‌మంలోనే ర‌కుల్‌కు దక్షిణాదినే కాకుండా, ఉత్తరాదిన కూడా పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండే.. త‌మిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో ర‌కుల్ `అయలాన్` అనే సినిమాలో న‌టిస్తోంది. ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌కుల్‌.. శివ కార్తికేయ‌న్ గురించి ప‌లు ఆస‌క్తిక విష‌యాలు పంచుకుంది.

Sivakarthikeyan Photos [HD]: Latest Images, Pictures, Stills of  Sivakarthikeyan - FilmiBeat

అయ‌లాన్ చిత్రంలో శివ కార్తికేయన్‌తో కలిసి నటించడాన్ని చాలా ఎంజాయ్ చేశాన‌ని తెలిపిన ర‌కుల్‌.. ఆయ‌న మంచి న‌టుడ‌ని, త‌నకు తమిళంలో సంభాషణలు ఎలా పలకాలో నేర్పించార‌ని మ‌రియు త‌న‌కు కావాల్సిన ఫుడ్ చెన్నైలో ఎక్కడ దొరుకుతుందో కూడా తెలిపార‌ని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో ఓ డీల్ కూడా కుదుర్చుకుంద‌ట ర‌కుల్‌. ఇంత‌కీ ఆ డీల్ ఏంటంటే.. సెట్‌లో ఉన్నంత కాలం ఆయన త‌న‌తో తమిళంలో మాట్లాడాలి.. తాను ఆయనతో ఇంగ్లీష్‌లో మాట్లాడాలట‌. కాగా, ర‌కుల్ చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

ఆ స్టార్ హీరోతో డీల్ కుదుర్చుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts