రామ్ చ‌ర‌ణ్‌ను తాకిన `ఉప్పెన‌`.. సో బ్యూటీఫుల్ అంటూ ట్వీట్!

January 16, 2021 at 12:15 pm

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్‌కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా క‌నిపించ‌నున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా.. విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో లాక్‏డౌన్ ఎఫెక్ట్‏తో వాయిదా పడింది.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ థియేట‌ర్లు ఓపెన్ అవ్వ‌డంతో.. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధం అయింది. ఇందులో భాగంగా ఈ చిత్ర టీజర్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఫీల్ గుడ్‌గా వ‌చ్చిన ఈ టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సెల‌బ్రెటీలు సైతం టీజ‌ర్‌పై త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే రామ్ చ‌ర‌ణ్ మ‌న‌సును కూడా ఉప్పెన టీజ‌ర్ తాకింది. ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలుపుతూ.. `ఉప్పెన టీజర్ చాలా అందంగా ఉంది. మై బ్రదర్ పంజా వైష్ణవ్ తేజ్ మరియు కృతిశెట్టిల జోడి చాలా ఫ్రెష్‏గా ఉండి. చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు` అంటూ కామెంట్స్ చేశారు చెర్రీ. ఇక రామ్ చ‌ర‌ణ్ ట్వీట్‌తో ఉప్పెన చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది.

రామ్ చ‌ర‌ణ్‌ను తాకిన `ఉప్పెన‌`.. సో బ్యూటీఫుల్ అంటూ ట్వీట్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts