
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇటీవల ప్రాణాంతక వైరస్ కరోనాను జయించిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి బయటపడిన తర్వాత చరణ్ మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొనడం మొదలు పెట్టారు. ప్రస్తుతం చరణ్.. ఎన్టీఆర్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్నారు.
అలాగే చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న `ఆచార్య` కూడా చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒకే రోజు చరణ్ రెండు షూటింగ్స్‌లోనూ జాయిన్ అవుతున్నాడట. ఒక సినిమా షూటింగ్ డే టైం లో జరుగుతుండగా మరో సినిమా షూటింగ్ నైట్ టైం జరుగుతుందట.
దాంతో చరణ్ డే అండ్ నైట్ షూట్ తో బిజీ బిజీగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న చరణ్.. ఇలా డే అండ్ నేట్ వర్క్ చేస్తూ రిస్క్ తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆయన అభిమానుల అందోళన పండుతున్నారట.