
అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రపంచదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి జీవం పోసుకుని సంవత్సరం అయినా.. జోరు మాత్రం తగ్గడం లేదు. ఇంకా ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇక ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా రామ్ చరణ్‌కు మరోసారి కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. ఆ రిపోర్టుల్లో నెగటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని చెర్రీ అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు నెగిటివ్ వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని.. వీలైనంత త్వరగా షూటింగ్లో పాల్గొనాలని ఉందని తెలిపాడు.
తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అందరికీ థాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక చెర్రీ కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడంతో.. ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.