వ‌ర్మ ‌డ్రీమ్ ప్రాజెక్ట్ `డీ కంపెనీ‌` టీజ‌ర్ విడుద‌ల‌!

January 23, 2021 at 2:34 pm

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల వ‌ర్మ.. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ స‌మ‌యంలో సినిమాలు తీసి.. క్యాష్ చేసుకున్న‌ వ‌ర్మ ప్ర‌స్తుతం `డీ కంపెనీ` అనే వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నాడు. ముంబైకి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్కిస్తున్నాడు.

అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. తన గత సినిమాల మాదిరే బ్యాక్‌గ్రౌండ్‌మ్యూజిక్‌తో చింపేశాడు ఆర్జీవీ. ఎలాంటి డైలాగ్స్‌ లేకుండా కేవలం బీజీఎంతో స్టోరీ ఏంటో తెలియజేస్తూ చివరల్లో ఒకే​ ఒక డైలాగ్‌తో టీజర్‌ని ముగించేశాడు. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ వైర‌ల్‌గా మారింది.

ఈ టీజ‌ర్‌ను పోస్ట్ చేసిన వ‌ర్మ‌.. `డీ కంపెనీ’ గ్యాంగ్ స్టర్ సినిమాలన్నింటికి మదర్ లాంటిదని.. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. అందుకే ‘డీ కంపెనీ’ సిరీస్ ని మహా భారతంతో పోలుస్తూ దీనికి ‘మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు.

వ‌ర్మ ‌డ్రీమ్ ప్రాజెక్ట్ `డీ కంపెనీ‌` టీజ‌ర్ విడుద‌ల‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts