వైరల్ వీడియో :సరిహద్దు దళాల తో సాహసాలు చేస్తున్నా రానా…!?

January 15, 2021 at 2:17 pm

టాలీవుడ్ లో రానా ద‌గ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రొటీన్‌కు భిన్నంగా చేయాల‌ని ఆలోచించే న‌టుల్లో రానా ఒక‌రు. తనకు ఆయన పాత్ర, దానికున్న ప్రాధాన్య‌త న‌చ్చితే చాలు. చిన్న పాత్ర‌లో అయిన క‌నిపించ‌డానికి సిద్ధం అవుతారు. ఈ స్వ‌భావ‌మే రానా ని ప్యాన్ ఇండియా యాక్టర్ని గా నిల‌బెట్టింది. కేవలం మూవీస్ ఏ కాకుండా బుల్లితెర‌పై కూడా రానా స్పెష‌ల్ షోస్ చేస్తుంటారు. ఇటీవలే రానా ఓ గొప్ప ప‌నిచేశాన‌ని, దాని వ‌ల్ల గొప్ప అనుభ‌వాన్ని పొందాన‌ని చెప్పుకొచ్చారు రానా ద‌గ్గుబాటి.

ఇంత‌కీ రానా అంత‌లా ఏ ప‌ని చేశారు అంటే స‌రిహ‌ద్దు ద‌ళాల ప‌నితీరుపై డిస్క‌వ‌రీ ప్ల‌స్ ఛానెల్‌తో క‌లిసి మిష‌న్ ఫ్రంట్ లైన్ అనే డాక్యుమెంట‌రీ చేశాడ‌ట‌ రానా దగ్గుబాటి. ఈ డాక్యుమెంట‌రీ డిస్క‌వ‌రీ ప్ల‌స్‌లో జ‌న‌వ‌రి 21న ప్ర‌సారం అవుతుంద‌ని ఆయన తెలిపారు. ఆ రోజున స‌రిహ‌ద్దు ద‌ళాల‌తో రానా ఎలాంటి సాహ‌సాలు చేశాడో మనము చూసేద్దాం.

వైరల్ వీడియో :సరిహద్దు దళాల తో సాహసాలు చేస్తున్నా రానా…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts