ఆక‌ట్టుకుంటున్న `రానా-మిహీక’ల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్.. మీరు చూశారా?

January 20, 2021 at 9:11 am

ద‌గ్గుబాటి వార‌బ్బాయి రానా ఇటీవ‌ల మిహీకా బజాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుని.. బ్యాచ్‌లర్ లైఫ్‌కి పుల్ స్టాప్ పెట్టి వైవాహిక‌ జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. రానా-మిహీక వివాహం ఆగస్టు 8న రామానాయుడు స్టుడియోలో పెద్దల స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అయితే లాక్‌డౌన్ ఉండ‌డంతో.. అతి త‌క్కువ స‌భ్యులే రానా- మిహీక‌ల వివాహంలో పాల్గొన్నారు.

Did Rana Daggubati, fiance Miheeka Bajaj get each other's name tattooed?  Check unseen pics from engagement | Celebrities News – India TV

ఇదిలా ఉంటే హ్యాండ్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన.. రానా మిహీకల గురించి సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో రానా మిహీకల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ ఫోటో పోస్ట్ చేసింది. అంతేగాక ఫోటోతో పాటు.. ‘మేం హ్యాండ్ ఇంప్రెషన్స్ కోసం రానా మిహీకలను కలిసినప్పుడు వారిద్దరిని చూస్తే మెడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించింది.

Miheeka & Rana Follow Deepika And Ranveer! | Gulte - Latest Andhra Pradesh,  Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

ఇక మేం చేతి ముద్రలను తీసుకునే సమయంలో మాస్కులు ధరించాం. కానీ మేం కళ్లతో వారి ఆనందాన్ని చూసాం` అంటూ రాసుకొచ్చింది. దీంతో భావ‌న చేసిన పోస్ట్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి. ఈ క్ర‌మంలోనే రానా-మిహీకల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ అద్భుతంగా ఉందంటూ ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు.

ఆక‌ట్టుకుంటున్న `రానా-మిహీక’ల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్.. మీరు చూశారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts