మరలా మెగాహీరోతో రొమాన్స్‌ చేయనున్న రాశికన్నా ?

January 24, 2021 at 2:37 pm

తెలుగు సినీ ఇండస్ట్రీలో రాశి ఖన్నా పేరు తెలియని వారుండరు అనటంలో సందేహం లేదు. దాదాపు ఆరేళ్లుగా టాలీవుడ్ సినీ పరిశ్రమ లో హీరోయిన్‌గా కొనసాగుతోంది. తనదైన పాత్రలతో ప్రేక్షకులు అందరిని ఆకట్టుకుంటోంది. ఊహలు గుసగుసలాడే అంటూ అందరిని ఊహల్లో తేల్చింది ఈ ఢిల్లీ బ్యూటీ. అయితే గత కొన్నాళ్లుగా టాలీవుడ్ నాట ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రావట్లేదు. వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత మరో సినిమా లేదు ఈ బ్యూటీకి.

కానీ తమిళంలో మాత్రం మంచి జోష్‌ను కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో తమిళంలో బిజీగా గడుపుతుంది. ఇప్పుడు తాజాగా ఈ భామకు మరో ఆఫర్‌ వచ్చిందట. మెగాహీరో సాయిధరమ్‌ తేజ్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబోలో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయితేజ్‌ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. కాగా గతంలో మెగా హీరో సాయితేజ్‌, రాశీ ఖన్నా కాంబోలో సుప్రీం, ప్రతిరోజూ పండగే సినిమాలు సూపర్‌ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.

మరలా మెగాహీరోతో రొమాన్స్‌ చేయనున్న రాశికన్నా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts