
ధృవ సర్జా, రష్మిక హీరో హీరోయిన్లుగా సాయి సూర్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన పొగరు సినిమాకి రిలీజ్ డేట్ ఖరారు అయింది. ఫిబ్రవరి 19న ఇరు తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతోన్నట్లుగా చిత్ర నిర్మాత డి. ప్రతాప్ రాజు తెలిపారు. కరాబు మైండు కరాబు మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు అంటూ ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్ యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ లో ఉంటూ ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ పెద్ద హిట్ కావటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ చిత్రాన్ని వైజాగ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సియర్, ప్రొడ్యూసర్ డి. ప్రతాప్ రాజు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత డి.ప్రతాప్ రాజు మాట్లాడుతూ ఇలా ఒక్క సాంగ్ తో యూట్యూబ్ లో ఇంకా టివి ఛానల్స్ లో రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకుని ట్రెండింగ్ అయ్యి ఇంత క్రేజ్ తెచ్చుకున్న మూవీ ఎన్నడూ చూడలేదు. తెలుగులో ఈ పొగరు చిత్ర తెలుగు హక్కులను మా సాయిసూర్య ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకోవడం మా దృష్టం. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలకి అన్ని సన్నాహాలు చేస్తున్నామని కన్నడ నిర్మాతలు తెలిపారు.. ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేస్తున్నాము. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే డబ్ల్యూ డబ్ల్యూ లో ఫేమస్ ఫైటర్స్ కాయ్ గ్రీనే, మోర్గన్ అస్తే, జో లిండర్, జాన్ లోకస్లు విలన్లుగా నటించడం. యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి చాలా సర్ప్రైజ్ లు ఈ చిత్రంలో డైరక్టర్ ప్రేక్షకులకు ఇవ్వనున్నాడు.