ర‌వితేజ ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!

January 15, 2021 at 8:12 am

మాస్ మహారాజా రవితేజ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్రసీమలో అడుగు పెట్టిన ర‌వితేజ‌.. మొద‌టి దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ప‌ని చేశారు. అదే స‌మ‌యంలో 1997 లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేసిన ర‌వితేజకు ఓ మోస్త‌రు గుర్తింపు ద‌క్కింది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో ప్రాధాన్య‌త ఉన్న‌ పాత్ర‌లు పోషించిన‌ప్ప‌టికీ బ్రేక్ రాలేదు.

శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా `నీ కోసం` సినిమాలో రవితేజ హీరోగా చేయ‌గా.. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇక ఆ త‌ర్వాత ఇడియ‌ట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి చిత్రాల‌తో ర‌వితేజ హీరోగా నిల‌దొక్కుకున్నాడు. ఇక హీరో నుంచి మాస్ హీరో అయ్యాడు.. ఇప్పుడు మాస్ రాజా అయ్యాడు రవితేజ. చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగింది రవితేజ మాత్రమే అన‌డంతో సందేహం లేదు.

అలాంటి ఆయ‌న ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ గా అందుకున్నది కేవలం 3500 రూపాయలట. ఈ విష‌యాన్ని ర‌వితేజ‌నే స్వ‌యంగా తెలిపారు. `నిన్నే పెళ్లాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసినందుకు తొలి పారితోషికంగా 3500 రూపాయల చెక్కును నాగార్జున గారి చేతుల మీదుగా పుచ్చుకున్నాను. అది ఫస్ట్ రెమ్యునరేషన్ కావడంతో.. ఆ చెక్కుని చాలా కాలం వరకు అపురూపంగా దాచుకున్నాను` అని ర‌వితేజ చెప్పుకొచ్చాడు. ఇక 3500 రూపాయలను తొలి రెమ్యున‌రేష‌న్‌గా తీసుకున్న ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం ఒక్కో సినిమా ప‌ది కోట్ల వ‌ర‌కు పుచ్చుకుంటున్నారంటే ఏ స్థాయిలో ఎదిగారో స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

ర‌వితేజ ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts