
గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ.. గోపిచంద్ మాలినేని దర్శకత్వంలో వచ్చిన `క్రాక్` చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. విడుదల రోజు కాస్త అవరోధాలు ఏర్పడినప్పటికీ.. మొదటి షో పడ్డప్పటి నుంచి అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతోంది. 50 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసేసిన క్రాక్.. ఇప్పటికీ పలు చోట్ల కలెక్షన్స్ రాబడుతోంది. అయితే క్రాక్ హిట్‌తో సూపర్ ఫామ్‌లోకి వచ్చిన రవితేజ రెమ్యునరేషన్ కూడా పెంచేశారని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం తన దగ్గరికి వచ్చే నిర్మాతలని 14 కోట్ల రెమ్యునరేషన్ + జిఎస్టి కలిపి మొత్తం 16 కోట్లు డిమాండ్ చేస్తు.. మైండ్‌బ్లాక్ చేస్తున్నారట. ఇక 16 కోట్లకి ఒక్క రూపాయి తగ్గినా సినిమా ఒప్పుకునేది లేదని రవితేజ చెప్పడంతో పలువురు నిర్మాతలు వెనక్కి తగ్గారని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.