
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజాగా చిత్రం `క్రాక్`. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ దుమ్ము దులిపేస్తుంది.
అనేక చిక్కులు వచ్చినప్పటికీ వాటన్నిటినీ తొక్కిపెట్టి సూపర్ స్ట్రాంగ్ గా మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ చిత్రం ఇప్పటికీ నిలబడుతుండడం విశేషం. ఈ క్రమంలోనే క్రాక్ కు పలు చోట్ల స్క్రీన్స్, షోలు యాడ్ అవుతున్నాయి. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అయితే ఇతర సినిమాలను పక్కన తోసేసి క్రాక్‌ను ప్రదర్శిస్తున్నారట.
మొత్తానికి సంక్రాంతి రేసులో వచ్చిన అన్ని సినిమాలను దాటి.. సంక్రాంతి విన్నర్‌గా రవితేజ క్రాక్ నిలిచిందని తాజా పరిస్థితులే క్లియర్ కట్‌గా చెబుతున్నాయి. అంతేకాదు, కరోనా తర్వాత సంచలన విజయం సాధించిన మొట్ట మొదటి తెలుగు సినిమాగా క్రాక్ నిలిచింది. ఇక చాలా కాలం గా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు `క్రాక్` చిత్రం ఫుల్ మీల్స్ పెట్టేసింది.