10 రోజులు దాటినా త‌గ్గ‌ని `క్రాక్‌` జోరు.. పెరిగిన షోల కౌంట్!

January 23, 2021 at 8:10 am

మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజా చిత్రం `క్రాక్‌`. గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శృతి హాసన్, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర‌ల్లో న‌టించారు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించిన‌ ఈ సినిమా జ‌న‌వ‌రి 9న విడుద‌లై.. సంక్రాంతి బ‌రిలో నిలిచిన అన్ని సినిమాల‌ను ప‌క్క‌కు నెట్టి విన్న‌ర్‌గా నిలిచింది.

దీంతో గ‌త నాలుగేళ్లుగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ ర‌వితేజ మ‌రియు గోపిచంద్ మ‌లినేనిల‌కు ఒక మాస్ హిట్ ద‌క్కింది. ఈ సినిమాతో రవితేజ మరోసారి తన పవరేంటో చూపించుకున్నాడు. ఇక మ‌రో విష‌యం ఏంటంటే.. సినిమా విడుద‌లై ప‌ది రోజులు దాటినా.. క్రాక్ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇంకా సూప‌ర్ స్ట్రాంగ్‌గా ఈ సినిమా కొనసాగుతోంది.

సగం సీటింగ్ లో కూడా బెస్ట్ గానే వసూల్ చేసిన ఈ చిత్రం ఇప్ప‌టికే నిర్మాతను సేఫ్ జోన్‌లో పెట్టేసింది. ఇక ప‌ది రోజులు దాటినా ‘క్రాక్’ కలెక్షన్స్ కోటికి తగ్గలేదని సమాచారం. 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ ఏకంగా 94లక్షల షేర్స్ రాబట్టిందట. మ‌రోవైపు మాస్, క్లాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిన ఆక‌ట్టుకున్న ఈ చిత్రం షోల కౌంట్ కూడా పెరిగింది.

10 రోజులు దాటినా త‌గ్గ‌ని `క్రాక్‌` జోరు.. పెరిగిన షోల కౌంట్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts