
మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `క్రాక్`. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ చిత్రం సూపర్ టాక్ తెచ్చుకుంది.
కరోనా కారణంగా 50 ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ.. క్రాక్ బాక్సాఫిస్ వద్ద దుమ్ముదులిపేస్తోంది. ఆడియెన్స్ పల్స్ ప్రకారం చూస్తే.. రవితేజ ఈ సంక్రాంతి పందాన్ని వార్ వన్ సైడ్ చేసాడనే అంటున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ఇదే అనడంలో సందేహమే లేదు.
ఈ క్రమంలోనే తొలి వారమే క్రాక్ రికార్డ్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 21. 50 కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ దాదాపు 38 కోట్ల వరకు ఉంది. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా జనం కరోనా భయాల్ని వదిలి థియేటర్లకు వస్తుండడంతో.. ఇప్పటికీ రోజుకు కనీసం 2 కోట్ల వరకు షేర్ తీసుకొస్తుంది క్రాక్.