`క్రాక్‌`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ర‌వితేజ‌కు క‌లిసొచ్చింది‌గా!

January 13, 2021 at 8:35 am

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన తాజాగా చిత్రం `క్రాక్‌`. గోపి చంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా న‌టించింది. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 9న థియేట‌ర్‌లో విడుద‌ల అయింది. అయితే ఈ చిత్రంతో చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు మాస్ రాజా.

సంక్రాంతి సీజన్‌లో పర్ఫెక్ట్ మాస్ సినిమా వస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయో ఈ సినిమా నిరూపిస్తుంది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా దుమ్ముదులిపేస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఆ వార్త ఏంటీ అంటే.. మొద‌ట‌ ‘క్రాక్’ సినిమా కథ ఓ సీనియ‌ర్‌ స్టార్‌ హీరో దగ్గరికి వెళ్లిదంట.

కానీ ఆయ‌న మాత్రం ఈ సినిమాకు రిజెక్ట్ చేశార‌ట‌. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. విక్ట‌రీ వెంక‌టేష్‌. గోపీ చంద్‌ మలినేని ఈ సినిమా కథతో వెంకీని కలిశాడట.. కథ మొత్తం విన్న వెంకీ సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేద‌ట‌. ఆ త‌ర్వాత రవితేజకు క‌థ చెప్ప‌డంతో.. ఆయ‌న గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. ఇప్పుడు హిట్ కొట్టారు. మొత్తానికి వెంకీ క్రాక్ కి నో చెప్ప‌డం.. ర‌వితేజ‌కు మాత్రం బాగానే క‌లిసొచ్చింద‌ని అంటున్నారు.

`క్రాక్‌`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ర‌వితేజ‌కు క‌లిసొచ్చింది‌గా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts