
గల్ఫ్ మూవీలో హీరోయిన్ గా అలరించి మెప్పించింది అందాల తార డింపుల్ హయతి. 2019లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దల కొండ గణేశ్ సినిమాలో జర్ర జర్ర అంటూ సాగే మాస్ బీట్ లో అందాలు ఆరబోస్తూ తన స్టన్నింగ్ డ్యాన్స్ తో అందరిని అదర గొట్టింది. ఈ భామ ప్రస్తుతం రవితేజతో ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. త్తజాగా ఈ అందాల భామకి సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో షికారు కొడుతోంది.
డింపుల్ హయతి బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు బీటౌన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అక్షయ్‌కుమార్ ధనుష్ ఇంకా సారా అలీఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ అట్రాంగి రే. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం మేకర్స్ డింపుల్ హయతిని సంప్రదించారన్న వార్త ఇపుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.