
ఇటీవల `క్రాక్` చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకుని సూపర్ ఫామ్‌లోకి వచ్చిన రవితేజ.. ప్రస్తుతం `ఖిలాడి` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు రవితేజ బర్త్‌డే సందర్భంగా.. ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. స్టైలిష్ లుక్‌లో రవితేజ పెద్ద సుత్తి పట్టుకుని నడుస్తున్నట్లు గ్లింప్స్ వీడియోలో ఉంది. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశారు.
మొత్తానికి మాస్ ఎలివేషన్స్ తో ఉన్న ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్ కి నచ్చేలా ఉంది. కాగా, ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి వేసవి కానుకగా విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. రవితేజ కెరియర్లో 67వ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఖిలాడి చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.