కెరీర్‌లోనే మొట్ట మొద‌టిసారి ఆ ఫీట్‌ను అందుకున్న ర‌వితేజ‌!

January 25, 2021 at 11:09 am

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. తాజాగా ఓ క్రేజీ ఫీట్‌ను అందుకున్నాడు. ర‌వితేజ, శ్రుతిహాస‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `క్రాక్‌`. గోపీచంద్ మలినేని దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం జనవరి 9న విడుద‌లై.. సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. రాజా ది గ్రేట్ త‌ర్వాత హిట్టే లేని ర‌వితేజ‌.. ఈ సినిమాతో మాస్ హిట్ కొట్టి మ‌ళ్లీ సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చేశారు.

అంతేకాదు, తాజాగా ఈ సినిమాతో కెరీర్‌లోనే మొట్ట మొద‌టిసారి ఓ సూప‌ర్ ఫీట్‌ను అందుకున్నాడు ర‌వితేజ‌. విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న క్రాక్ చిత్రం.. కిర్రాక్ కలెక్షన్స్ రాబడుతోంది. నేటికీ ఈ సినిమాపై ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గకపోగా.. ఇప్ప‌టి వ‌రకు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ చిత్రం ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.

దీంతో రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా క్రాక్ నిలిచింది. ఇక భారీ కలెక్షన్స్‌తో ప్రస్తుతం ప్రాఫిట్ జోన్‌లో కొనసాగుతున్న క్రాక్ సినిమాకు థియేటర్స్ సంఖ్య కూడా పెరగనుండటం.. మ‌రింత ప్లాస్ అయింది. కాగా, త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుద‌ల కానుంది.

కెరీర్‌లోనే మొట్ట మొద‌టిసారి ఆ ఫీట్‌ను అందుకున్న ర‌వితేజ‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts