
గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ.. ఇటీవల విడుదలైన `క్రాక్` చిత్రంతో మళ్లీ సూపర్ ఫామ్‌లోకి వచ్చేశాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. సంక్రాంతికి విడుదలై మాస్ మసాలా ఎంటర్టైనర్గా హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ మరో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
అదే `ఖిలాడి`. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డా.జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభం అయిన ఈ సినిమాలో షూటింగ్లో.. తాజాగా రవితేజ కూడా జాయిన్ అయ్యాడు.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రవితేజ అభిమానులతో పంచుకున్నాడు. లైట్స్.. కెమెరా.. యాక్షన్ అంటూ క్యాప్షన్ ఇస్తూ.. ఖిలాడి సెట్లో దిగిన సెల్ఫీని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు రవితేజ. ఈ ఫొటోలో రవితేజ చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Lights. Camera. Action.
From the sets of my next..#Khiladi 😉 pic.twitter.com/KxYQd6LsmP— Ravi Teja (@RaviTeja_offl) January 18, 2021