
గత ఏడాది రెడ్మీ 9 ప్రైమ్‌ను రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా షియోమీ తన రెడ్మీ 9 ప్రైమ్ యూజర్లకు శుభవార్త తెలిపింది. 9 ప్రైమ్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 11తో పనిచేస్తుంది. ఇప్పుడు 9 ప్రైమ్ యూజర్లకు ఎంఐయుఐ12 అప్డేట్ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. వినియోగదారులు కూడా ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు.
దీనికి సంబందించిన స్క్రీన్ షాట్లను తమ ట్విటర్ లో యూజర్లు షేర్ చేస్తున్నారు. భారతదేశంలోని రెడ్మి 9 ప్రైమ్‌కు తీసుకురానునట్లు ప్రకటించింది. ఇది దశల వారీగా యూజర్స్ కి అందుబాటులో రానుంది. రెడ్మి 9 ప్రైమ్ భారతదేశంలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఎంట్రీ వేరియంట్ 4జీబీ + 64జీబీ స్టోరేజ్ కాగా, మరొకటి 6జీబీ ర్యామ్ +1 28 జీబీ స్టోరేజ్ వేరియంట్. డిసెంబర్ 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌తో ఈ అప్డేట్ రాబోతుంది.