తలైవి డేట్ ఖరారు.. ఎప్పుడంటే?

January 19, 2021 at 3:14 pm

వివాదాస్పద నటి కంగనా రనౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి చిత్రం చేస్తోంది. ఈ మూవీలో కంగనా లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్దీ రోజులుగా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రూపొందిన తలైవీ విడుదల డేట్‌ను ఎట్టకేలకు ఖరారు చేశారు. మూవీ చిత్రీకరణకు చాలా టైం తీసుకున్న టీం విడుదలకు మాత్రం చాలా హడావిడీ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని వాస్తవానికి గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలని సినీ బృందం ఆలోచన చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామీ నటించాడు. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు ఎంత వరుకు నిలబెట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

తలైవి డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts