మహేష్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేణు దేశాయ్…!?

January 8, 2021 at 1:32 pm

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం కంబినేషన్లో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా నటిస్తున్నట్లు పలు వార్తలు రావడంతో ఈ వార్త ఇండస్ట్రీ ఇంకా సోషల్ మీడియాలో పెద్ద హల్చల్ అయింది. ఇటువంటి క్రమంలో తాజాగా రేణుదేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి వస్తున్న ఈ వార్తల విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చింది. లైవ్ లో తన ఫాన్స్ తో ముచ్చటించిన క్రమంలో మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట చిత్రంలో మీరు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి వాటిలో నిజం ఎంత అని ఒక నెటిజన్ ప్రశ్నించారు.

అయితే వస్తున్న ఈ వార్తల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని రేణుదేశాయ్ తెలిపింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో యాడ్ చేస్తున్నట్లు, దానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తయినట్లు త్వరలోనే అన్ని వివరాలు చెప్తానని రేణుదేశాయ్ చెప్పారు. దానితో తమ అభిమాన హీరో మూవీలో రేణు ఉంటుందని ఆశ పడ్డ మహేష్ అభిమానులకు తాజాగా రేణు ఇచ్చిన క్లారిటీ తో మహేష్ ఫ్యాన్స్ కు షాక్ తగిలినట్టు అయింది.

మహేష్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేణు దేశాయ్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts