కొత్త అవ‌తారంలో రేణు దేశాయ్.. వైర‌ల్‌గా ఫొటోలు!

January 20, 2021 at 10:51 am

నటి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌వ‌న్ నుంచి విడిపోయిన త‌ర్వాత పిల్ల‌ల‌తో ఒంట‌రిగా నివ‌సించిన రేణు.. ప్ర‌స్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. ఇటీవ‌ల ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్న‌ట్టు రేణు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

 Renu Desai: రేణు దేశాయ్ వారణాసిలో పర్యటిస్తున్నారు. కాశీ విశ్వనాథుడి దర్శనం అనంతరం ఆమె సరికొత్త లుక్‌లో కనిపించారు. జట్టు విరబోసుకొని.. నుదుటనామాలతో.. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అంతేకాదు మతతత్వంపై రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.

ఈ వెబ్‌ సిరీస్‌కి ఎమ్‌ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి అవ్వ‌గా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ఒక సినిమాకు కూడా రేణు గ్రీన్ సిగ్నెల్‌. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియా రేణు య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టి క‌ప్పుడు త‌న‌కు, త‌న పిల్ల‌ల‌కు సంబంధించిన విష‌యాల‌ను షేర్ చేస్తుంటుంది.

 మతతత్వ భావనతో కాదు.. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండండి. ఆ రెండింటికీ తేడా తెలుసుకోండి అని ఇన్‌స్టగ్రామ్‌లో ఫొటోను పోస్ట్ చేశారు రేణు దేశాయ్.

అయితే తాజాగా కాశీ విశ్వనాథుడి దర్శనం అనంతరం ఆమె సరికొత్త అల‌తారంలో కనిపించారు. జట్టు విరబోసుకొని.. నుదుటనామాలతో.. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన రేణు.. మతతత్వ భావనతో కాదు.. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండండి. ఆ రెండింటికీ తేడా తెలుసుకోండి అని కామెంట్ కూడా పెట్టింది. దీంతో ప్ర‌స్తుతం రేణు ఫొటో వైర‌ల్‌గా మారింది.

కొత్త అవ‌తారంలో రేణు దేశాయ్.. వైర‌ల్‌గా ఫొటోలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts