యూట్యూబర్ ఇచ్చిన తప్పుడు రివ్యూతో మూతపడ్డ రెస్టారెంట్..!?

January 15, 2021 at 2:09 pm

ఓ యూట్యూబర్ పోస్ట్ చేసిన వీడియో కారణంగా ఓ రెస్టారెంట్ మూతపడింది. ఆలస్యంగా నిజం తెలుసుకున్న యూట్యూబర్ తాను చేసిన తప్పును సరిదిద్దుకున్దమై వెళ్లినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దక్షిణ కొరియాకు చెందిన యూట్యూబర్ హయాన్ ట్రీ తన యూట్యూబ్ ఛానెల్‌లో డేగులోని ఆల్-యు-కెన్-సోయా సాస్-మెరినేటెడ్ రెస్టారెంట్‌కు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసాడు. ఈ వీడియో సారాంశం ఏంటంటే తాను రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు మిగిలిన పోయిన పదార్ధాలను వడ్డిస్తున్నారు అని వీడియో పోస్ట్ చేశాడు. అది కాస్తా బాగా వైరల్ అయింది. హయాన్ ట్రీ ఛానెల్‌కు అప్పటికే 7లక్షల మంది సబ్‌స్క్రైబ్ ఉన్నారు. రెస్టారెంట్‌కు సంబంధించిన వీడియో వల్ల ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసిన వారిపై ప్రభావం చూపింది.

అయితే, రెస్టారెంట్ యొక్క సెక్యూరిటీ కెమెరా ఫుటేజీని మరొకసారి పరిశీలించిగా, అన్నం మెతుకులు హయాన్ట్రీ ముందు ఆర్డర్ ఇచ్చిన వంటకం నుండి మిగిలిపోయినవి అని స్పష్టం అయింది. వీడియో చెక్ చేసుకోకుండా అప్‌లోడ్ చేసాను. అందుకు రెస్టారెంట్ ఓనర్ కి క్షమాపణ చెప్పడానికి వెళ్ళాను, కాని ఆయన సుముఖంగా లేడు అని హయాన్ ట్రీ చెప్పారు. నిజమైన వాస్తవాలతో వీడియోను రూపొందించడం చాలా ముఖ్యమని, కానీ అప్పటికే నష్టం జరిగింది. మూసివేసిన రెస్టారెంట్ యజమాని చెయోంగ్ తన వెబ్‌సైట్‌లో ఇలా పోస్ట్ చేశారు. యూట్యూబర్ వీడియోను పోస్ట్ చేసిన రెండు, మూడు గంటలలోపు సీసీ కెమెరాలోని మొత్తం ఫుటేజీని పరిశీలించాము. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. మా వ్యాఖ్యలను ఎవరూ నమ్మలేదు. తప్పుడు సమీక్ష ఉన్న వీడియో 1 మిలియన్ వీక్షణలకు చేరుకుంది. అసలు ఇలాంటి యూట్యూబర్లను నియంత్రించేలా చట్టాలు తీసుకురావాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు.

యూట్యూబర్ ఇచ్చిన తప్పుడు రివ్యూతో మూతపడ్డ రెస్టారెంట్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts