నిఖిల్ బ‌ర్త్‌డే సందర్బంగా రైడ‌ర్ టీజ‌ర్ రిలీజ్..!!

January 22, 2021 at 2:08 pm

మాజీ ప్ర‌ధాని హెచ్‌.డి. దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు యువ‌రాజా నిఖిల్ కుమార్ జాగ్వార్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల్లరించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్లాప్ అవ్వటంతో కొన్నాళ్ళ పాటు టాలీవుడ్‌కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు తాజాగా తన నాలుగో సినిమా తెలుగులో రైడ‌ర్ అనే స్ట్రయిట్‌ సినిమా చేస్తున్నారు నిఖిల్ కుమార్ . ఈ మూవీకి విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరెకెక్కుతున్న రైడ‌ర్ చిత్రాన్ని ల‌హ‌రి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై చంద్రు మ‌నోహ‌ర‌న్ నిర్మిస్తున్నారు. ఈ రోజు నిఖిల్ కుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రైడ‌ర్ టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా యాక్షన్ మోడ్‌తో ఉన్నట్టు తెలుస్తుంది. నిఖిల్‌ కుమార్‌ సరసన ఈ మూవీలో క‌శ్మీరా ప‌ర‌దేశి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో ఈ చిత్రం నిర్మాణ‌మ‌వుతోంది. అతి త్వ‌ర‌లోనే మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

rider

నిఖిల్ బ‌ర్త్‌డే సందర్బంగా రైడ‌ర్ టీజ‌ర్ రిలీజ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts