
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఇటీవల విజయవంతంగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో అభిజిత్ విన్నర్‌గా నిలవగా.. అఖిల్ రన్నర్‌గా నిలిచాడు. ముఖ్యంగా అభిజిత్ విషయానికి వస్తే.. 11 వారాలు నామినేషన్లో ఉన్నా ప్రేక్షకుల ఓటింగ్‌తో ఫినాలేకు చేరుకుని టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ అభిజిత్‌కు అదిరిపోయే గిఫ్ట్ పంపారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న రోహిత్ శర్మ.. అభిజిత్‌కు ఫోన్ చేసి బిగ్ బాస్ విన్నర్ అయినందుకు అభినందించాడు. అంతేకాదు, తన జెర్సీపై ‘విత్ లవ్ అండ్ బెస్ట్ విషెస్’ అని రాసి తన సంతకం చేసి అభిజిత్ కు పంపించాడు. తెలుగు క్రికెటర్ అయిన హనుమ విహారి కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మకు కూడా తెలుగు వచ్చు.
ఇద్దరు తెలుగు వారు కావడంతో బిగ్ బాస్ చర్చ రాగా.. హనుమవిహారి బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ గురించి చెప్పాడు. ఈ క్రమంలోనే రోహిత్ అభిని అభినందించాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అభిజిత్.. ఆనందంతో గాల్లో తేలిపోయాడు. తన గురించి రోహిత్ శర్మకు చెప్పిన తెలుగు క్రికెటర్ హనుమ విహారికి ధన్యవాదాలు తెలిపాడు. మరియు రోహిత్‌పై, క్రికెట్‌పై తనకున్న ఇష్టాన్ని అభిజిత్ ప్యాన్స్‌తో పంచుకున్నాడు.