క్లైమాక్స్‌కి చేరుకున్న `ఆర్ఆర్ఆర్‌`.. వైర‌ల్‌గా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల ట్వీట్లు!

January 20, 2021 at 9:31 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం)‌`. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. గ‌త రెండేళ్లుగా ఈ చిత్రం కోసం అటు నంద‌మూరి, ఇటు మెగా అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.

Image

అస‌లు క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌లై ఉండేది. కానీ, క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ రావ‌డంతో.. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మ‌ళ్లీ ఇటీవ‌ల జ‌క్క‌న్న ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను రీ స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఓ న‌యా అప్‌డేట్ వ‌చ్చింది. ఇంత‌కీ ఆ ఆప్‌డేట్ ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ క్లైమాక్స్‌కి వచ్చింది. ప్రస్తుతం హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ సహా ఇతర తారాగణంపై భారీ ఎత్తున పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

`శక్తిమంతమైన భీమ్‌, మండే అగ్నిగోళం వంటి రామ్‌ కలసికట్టుగా తాము కలలు కన్నది, కోరుకున్నది సాధించడానికి ఒక్కటయ్యారు. వెండితెర వినోదం త్వరలో మీ ముందుకు రాబోతోంది` అని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. ఇక ఇదే విష‌యాన్ని తెలుపుతూ ఎంతో ఉత్తేజంతో ఉన్నాను అని ఎన్టీఆర్‌, చాలా ఉత్సాహంగా సిద్ధమయ్యా అని రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో వారి ట్వీట్లు వైర‌ల్‌గా మారాయి.

క్లైమాక్స్‌కి చేరుకున్న `ఆర్ఆర్ఆర్‌`.. వైర‌ల్‌గా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల ట్వీట్లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts