`నీళ్లలో నిప్పు`.. చ‌ర‌ణ్ షాట్‌ను షేర్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్‌!

January 28, 2021 at 11:56 am

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా `ఆర్ఆర్ఆర్` సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు.

భారీ అంచ‌నాల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ ఏడాది ద‌స‌రా కానుక‌గా అక్టోబర్ 13వ తేదీన విడుద‌ల కానున్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, స‌ముద్ర‌ఖ‌ని, ఆలిస‌న్ డూడీ, ఒలివియా మోరిస్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా చిత్ర యూనిట్ ఓ చిన్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. `నీళ్లలో నిప్పు` అంటూ రామ్‌చరణ్‌పై తీస్తున్న షాట్‌ను పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. యం.యం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నాడు.

`నీళ్లలో నిప్పు`.. చ‌ర‌ణ్ షాట్‌ను షేర్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts