`ఆర్ఆర్ఆర్` రిలీజ్ డేట్ రివిల్ చేసేసిన జ‌క్క‌న్న‌!

January 25, 2021 at 2:36 pm

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)`. భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలివియోమోరిస్, రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియాభ‌ట్ హీరోయిన్లుగా క‌నిపించ‌నున్నారు.

అయితే నేటి ఉద‌యం జ‌క్క‌న్న ఓ ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ నుంచి ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఓ కీల‌క అప్‌డేట్ వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే చెప్పిన‌ట్టుగానే ఆర్ఆర్ఆర్ చిత్ర టీమ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన `ఆర్ఆర్ఆర్` సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిప్పు, నీరు అసాధారణ వేగాన్ని అక్టోబర్ 13న చూడండి అని రాజమౌళి సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొంటూ ఓ పోస్ట‌ర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బుల్లెట్ తరహా బైక్‌పై దూసుకెళ్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ప్ర‌జ‌లంద‌రూ ఎగ్జైట్ అవుతున్నారు.

`ఆర్ఆర్ఆర్` రిలీజ్ డేట్ రివిల్ చేసేసిన జ‌క్క‌న్న‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts