కారును శుభ్రం చేయమని ఇస్తే మూడు కోట్లు నష్టం… ఎలాగంటే..!?

January 15, 2021 at 12:59 pm

ఇటలీ ఫుట్ బాలర్ ఫెడ్రికోకు ఓ షాప్ క్లీనర్ పెద్ద షాక్ ఇచ్చాడు. తన కారును శుభ్రం చేయమని వారి చేతిలో పెడితే దాని ముందు భాగాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చేతిలో పెట్టాడు. అసలేం ఏమి జరిగిందంటే ఫెడ్రికో అక్షరాలా మూడు కోట్ల రూపాయలు ఖరీదైన తన ఫెరారీ కారును శుభ్రం చెయ్యమని ఒక కార్ వాష్ సెంటర్ కు అప్పగించాడు. ఆ షాప్ క్లీనర్ కారును శుభ్రం చేసిన తరువాత ఆ కారుని రోడ్డు మీదకు తెచ్చే తరుణంలో అనుకోకుండా ప్రమాదవశాత్తూ ఐదు కార్లను ఢీ కొట్టాడు.

దీంతో ఫెరారీ కారు ముందు భాగం ముక్కలు అయ్యి చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. ఈ సంఘటనపై ఫెడ్రికో స్పందించి, తన కారు బాగా దెబ్బతింది కానీ ఎవ్వరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన తెలిపాడు. ఎవ్వరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటం పై ఆనందం వ్యక్తం చేశాడు.

కారును శుభ్రం చేయమని ఇస్తే మూడు కోట్లు నష్టం… ఎలాగంటే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts