అడివి శేష్ హీరోయిన్‌తో బ‌న్నీ రొమాన్స్‌..అంతా ఆ ద‌ర్శ‌కుడి ప్లానేనా?

January 16, 2021 at 8:16 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్‌ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బన్నీ.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవలే ఓ ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ చేసి బన్నీ- కొరటాల కాంబోను కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ చిత్రంలో బ‌న్నీకి జోడీగా బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్‌ను కొర‌టాల శివ తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఇందులో భాగంగా కొర‌టాల ఇటీవ‌ల ఆమెను సంప్ర‌దించ‌గా.. సయీ మంజ్రేకర్‌ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. కాగా, సయీ మంజ్రేకర్‌ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్ 3’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అంతేకాదు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘మేజర్’ సినిమాలో కూడా నటిస్తోంది.

Actor Saiee Manjrekar Movies List, Saiee Manjrekar Filmography, Saiee  Manjrekar 1 Films

అడివి శేష్ హీరోయిన్‌తో బ‌న్నీ రొమాన్స్‌..అంతా ఆ ద‌ర్శ‌కుడి ప్లానేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts