ఆ ఛాలెంజింగ్ పాత్ర‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సాయి ప‌ల్ల‌వి?

January 18, 2021 at 8:41 am

యాక్ష‌న్ హీరో గోపిచంద్- ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోయే తాజా చిత్రం ‘అలిమేలుమంగ వేంకటరమణ’. ఇన్నాళ్లు యాక్షన్ చిత్రాలలోనే ఎక్కువగా నటించిన గోపీచంద్.. ఈసారి పూర్తి ఫ్యామిలీ డ్రామాతో సాగే కథతో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబందిచి ఇప్పటికే స్క్రిప్టు పని పూర్తిచేసిన తేజ.. ఇతర నటీనటులు, టెక్నికల్ సిబ్బందిని సమకూర్చుకునే పనిలో ఉన్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ అలిమేలు మంగ పాత్ర చాల కీలకమైనది, పైగా సినిమా కూడా ఈ పాత్ర మీదే నడుస్తోంది. దీంతో ఈ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే అనుష్క‌, కీర్తి సురేష్, కాజ‌ల్‌ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించినా.. ప్ర‌స్తుతం వాళ్ళు సినిమాకి బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు.

ఈ క్ర‌మంలోనే ఆ పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవిను తేజ‌ ఫైనల్ చేశారన్న టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఉంటుంద‌ని స‌మాచారం. ఇక ఈ ప్ర‌చారం నిజ‌మైతే.. మొద‌టి సారి సాయి ప‌ల్ల‌వి గోపిచంద్ స‌ర‌స‌న న‌టించిన‌ట్టు అవుతుంది. కాగా, ప్ర‌స్తుతం సీటిమార్‌తో బిజీగా ఉన్న గోపిచంద్‌.. ఈ సినిమా పూర్తి కాగానే అలిమేలుమంగ వేంకటరమణను సెట్స్ మీద‌కు తీసుకెళ్ల‌నున్నాడు.

ఆ ఛాలెంజింగ్ పాత్ర‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సాయి ప‌ల్ల‌వి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts