నాని సినిమాకు సాయి ప‌ల్ల‌వి భారీ రెమ్యున‌రేష‌న్‌.. ఎంతో తెలుసా?

January 8, 2021 at 12:30 pm

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో `శ్యామ్ సింగ రాయ్` ఒక‌టి. వైవిధ్యమైన టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. పిరియాడిక్‌ మూవీగా రూపొందనున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రం కోసం సాయి ప‌ల్ల‌వి భారీగా రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ట‌.

దాదాపుగా కోటిన్నర రూపాయల వ‌ర‌కు సాయి ప‌ల్ల‌వి ఈ సినిమాకు తీసుకుంటుంద‌ట‌. ఇక అడిగిన మొత్తం ఇచ్చి ఆమె చేత ఈ రోల్ చేయిస్తున్నార‌ట మేక‌ర్స్‌. ఈ వార్త‌లో ఎంత నిజం ఉందో తెలియ‌దు. కానీ, ప్ర‌స్తుతం ఈ న్యూస్ మాత్రం నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, ఈ చిత్రానికి మెలోడీ సాంగ్స్ స్పెష‌లిస్ట్ మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

నాని సినిమాకు సాయి ప‌ల్ల‌వి భారీ రెమ్యున‌రేష‌న్‌.. ఎంతో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts