ప‌వ‌న్ సినిమాతో టెన్ష‌న్‌లో ప‌డ్డ సాయి ప‌ల్ల‌వి.. ఏం జ‌రిగిందంటే?

January 16, 2021 at 10:53 am

`ఫిదా` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన సాయి ప‌ల్ల‌వి.. మొద‌టి చిత్రంతోనే అంద‌రి చూపుల‌ను త‌న‌వైపుకు తిప్పుకుంది. మొద‌టి నుంచి న‌టనకు ఆస్కారం ఉన్న పాత్రైతేనే ఒప్పుకునే సాయి ప‌ల్ల‌వి.. ఇటు తెలుగుతో పాటుగా త‌మిళంలో కూడా స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్స్‌లో సాయి ప‌ల్ల‌వి ఒక‌రు.

ఇటీవ‌ల నాగ చైత‌న్య ‌`లవ్ స్టోరీ` షూటింగ్‌ని పూర్తి చేసుకున్న‌ సాయి ప‌ల్ల‌వి.. ఇప్పుడు రానా `విరాటపర్వం`, నానితో `శ్యామ్ సింగరాయ్` సినిమాలు చేస్తోంది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా హీరోలుగా తెర‌కెక్క‌బోయే `అయ్యప్పన్ కోషియమ్` రీమేక్‌లో కూడా సాయి ప‌ల్ల‌వి ఛాన్స్ కొట్టేసింది. సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు భార్య‌గా సాయి ప‌ల్ల‌వి న‌టించాల్సి ఉంది.

అయితే ఇప్ప‌డు ఈ సినిమా వ‌ల్ల సాయి ప‌ల్ల‌వి టెన్ష‌న్‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ప‌వ‌న్‌ సినిమాకు డేట్లు కేటాయించడం సాయిపల్లవికి పెద్ద సమస్యగా మారిందట. వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌కు డేట్లు అడ్జెస్ట్ కావడం లేదట. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ సినిమాకు డేట్లు ఎలా అడ్జెస్ట్ చేయాలో తెలియ‌క సాయి ప‌ల్ల‌వి తిక మ‌క ప‌డుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌వ‌న్ సినిమాతో టెన్ష‌న్‌లో ప‌డ్డ సాయి ప‌ల్ల‌వి.. ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts