
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్‌నీల్ డైరెక్షన్లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. సంక్రాంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు యశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూజా కార్యక్రమం అనంతరం ప్రభాస్, యశ్ ఫొటోలకు పోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కనున్న సలార్‌లో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. సలార్ అంటే సమర్థవంతమైన నాయకుడు. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అనిదర్శకుడు ప్రశాంత్‌నీల్ వెల్లడించిన విషయంతెలిసిందే. ఇంకో వైపు ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్‌నీల్ కూడా కేజీయఫ్-2 విడుదలకు సిద్ధం అవుతున్నారు.