
`ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన సమంత.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకుంటూ సత్తా చాటిన సమంత.. 2017లో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని కోడలిగా సెటిల్ అయిపోయింది.
ఇక పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు మరియు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా సమంత యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటి కప్పుడు అభిమానులతో ముచ్చటించే సమంత తాజాగా కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీకు ఎదురయ్యే ట్రోలింగ్ ఎలా ఎదుర్కొంటారు.?’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు.
అయిదే దీనికి సమాధానంగా సమంత..ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల నిద్ర కూడా పట్టేది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. అలా నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను. కానీ ఇప్పుడు మాత్రం నవ్వొస్తుంది. అయినా మనపై ట్రోలింగ్ చేస్తున్నారంటే.. మనం ఎంతో ఎత్తుకు ఎదిగామనిస్తుందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే మరో అభిమాని ప్రశ్నకు.. తాను చేసిన పాత్రల్లో `ఓ బేబీ, ఫ్యామిలీ మ్యాన్` అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది సమంత.