స‌మంత స‌రికొత్త రికార్డు.. దేశంలో మ‌రే హీరోయిన్‌కు సాధ్యం కాలేదుగా!

January 23, 2021 at 9:28 am

అక్కినేని వారి కోడ‌లు స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏమాయ చేశావే` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. ఒక పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను ఏ మాత్రం స్లో చేయ‌కుండా.. దూసుకుపోతోంది. ఇక సినిమాలో పాటుగా ఇటీవ‌ల ఓటీటీలో కూడా అడుగు పెట్టింది ఈ బ్యూటీ.

ఇటీవ‌ల ఆహాలో ప్ర‌సార‌మైన సామ్ జామ్ షో కోసం హోస్ట్‌గా మారిన స‌మంత‌, అమెజాన్ ప్రైమ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో విల‌న్‌గా న‌టించింది. ఇదిలా ఉంటే.. తాజాగా స‌మంత మ‌న దేశంలో మ‌రే హీరోయిన్‌కు సాధ్యం కాని ఓ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. స‌మంత న‌టించిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది. దీంతో యూనిట్ ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు.

ఇందులో స‌మంత కూడా భాగం కాగా.. తాజాగా ఆమెకు ట్విట్ట‌ర్,అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ది ఫ్యామిలీమెన్ 2 వెబ్ సిరీస్‌లో స‌మంత పాత్ర‌ని ఎమోజీగా రూపొందించి విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది. అయితే ఇప్పటి వరకు చాలా మంది స్టార్ హీరోల ఎమోజీలు అయితే చూసాం. కానీ, ఒక హీరోయిన్ కు ఎమోజీ చెయ్యడం అనేది ఇదే మొట్ట మొదటి సారి. అందుకే మన దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి హీరోయిన్ గా సమంతా రికార్డ్ సెట్ చేసింది.

క్యారెక్ట‌ర్ ఎమోజీ పొందిన తొలి భారతీయ న‌టి స‌మంత !

స‌మంత స‌రికొత్త రికార్డు.. దేశంలో మ‌రే హీరోయిన్‌కు సాధ్యం కాలేదుగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts