అఖిల్ కోసం భారీ ప్లాన్ వేసిన స‌మంత‌.. వ‌ర్కౌట్ అవుతుందా?

January 18, 2021 at 10:28 am

వి. వి. వినాయక్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `అఖిల్‌` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని.. ఆ త‌ర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాల్లో న‌టించారు. కానీ, ఈ మూడు చిత్రాలు అఖిల్‌కు హిట్‌ను అందించ‌లేక‌పోయాయి. ఇక బాక్సాఫీస్ వద్ద ఇంతవరకు సక్సెస్ చూడని అఖిల్.. ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` చిత్రం చేస్తున్నాడు.

ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ సినిమాపై అఖిల్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ అందుకునేందుకు అఖిల్ ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న అఖిల్ కోసం స‌మంత భారీ ప్లాన్ వేసింది. బాలీవుడ్ దర్శక ద్యం రాజ్‌, డీకేలతో అఖిల్ సినిమా సెట్ చేస్తుంది సమంత.

వీళ్లు తీయబోయే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ అయితే బాగుంటాడని వాళ్లను ఒప్పించే పనిలో పడింది అక్కినేని కోడలు. ఈ ఇద్దరి దర్శకత్వంలో ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ 2 చేసింది సమంత. అయితే ఇటీవ‌ల ఈ సిరీస్ దర్శకులైన రాజ్ అండ్ డీకే ఓ స్క్రిప్ట్ సమంతకు నేరేట్ చేయ‌గా.. ఈ కథ తన మరిది అఖిల్‌కు అయితే బాగా సెట్టవుతుందని వాళ్లకు చెప్పినట్లు తెలుస్తుంది. మ‌రి మ‌రిది కోసం సమంత వేసిన ప్లాన్ ఎంత వ‌ర‌కు వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి.

అఖిల్ కోసం భారీ ప్లాన్ వేసిన స‌మంత‌.. వ‌ర్కౌట్ అవుతుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts