సందీప్ కిషన్ “A1 ఎక్స్‌ప్రెస్ ” ట్రైలర్ విడుదల..!

January 26, 2021 at 7:14 pm

ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఎదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. ఆ టాలెంట్ ను ఎదుటివారు గుర్తించే క్రమంలో కొంత ఆలస్యం అవుతుంది. అలానే కొంతమందికి ఆటలు అంటే ఇష్టం. మరీ కొంతమందికి పాటలు పాడడం అంటే ఇష్టం.. ఇలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. దానిని ప్రపంచానికి చూపే క్రమంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా అడ్డు పడుతూ వస్తూ ఉంటారు.

ఈ క్రమంలో ఇద్దరు ప్లేయర్స్ వాళ్ళ గమ్యాన్ని చేరుకున్నారా.? లేదా? అనే కథతో మన ముందుకు వస్తున్నారు. జనవరి 26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘ ఏ1 ఎక్స్‌ప్రెస్‌’.  చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సందీప్‌, లావణ్యలు హాకీ ప్లేయర్లుగా కనిపించనున్నారు.మరి హాకీ ఆట ఆడేందుకు వీరు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఆ సమస్యలను అధిగమించి ఎలా ముందుకు సాగరన్నది తెలియాంటే సినిమా చుస్తే గాని అర్ధం అవ్వదు.

ఈ ట్రైలర్ లో భాగంగా ‘ఈ చారిత్రాత్మక ఆట సాక్షిగా ఈసారి కప్పు మనమే కొడుతున్నాం’ అంటూ రావు రమేశ్‌ సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇంకా ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వనుంది. ఈ క్రమంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ మన దేశంలో స్పోర్ట్స్‌మెన్‌కు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు సర్‌. స్పోర్ట్స్‌ అంటే ఒక బిజినెస్‌ గా భావిస్తున్నారు. ఏ స్పోర్ట్స్‌ చూడాలో, ఏది చూడకూడదో అనే విషయం కూడా బిజినెస్‌మెన్‌ నిర్ణయిస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సందీప్‌ కిషన్‌.

సందీప్ కిషన్ “A1 ఎక్స్‌ప్రెస్ ” ట్రైలర్ విడుదల..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts