సానియా మీర్జా కోవిడ్ పాజిటివ్…!?

January 20, 2021 at 2:41 pm

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ సంగతిని ఆమె కొంత ఆలస్యంగా స్వయంగా ప్రకటించింది. తాను ఈ ఏడాది మొదట్లోనే కరోనా బారిన పడ్డానని తెలిపింది. తన పాజిటివ్ అని తెలియగానే కుటుంబానికి, కుమారుడికి దూరంగా నిర్బంధంలో ఉన్నన్ని అది చాలా కష్టం అనిపించిందని సానియా చెప్పింది. తన అనుభవాలను ఇటీవలే సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి నా జీవితంలో జరిగిన ఘటనలను పంచుకుంటున్నాను.

నాకు కరోనా సోకింది కానీ భగవంతుని దయ వల్ల ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. అయితే నాకు కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడం అదృష్టం. నా కుటుంబానికి దూరంగా స్వీయ నిర్బంధంలో ఉండటం మాత్రం నన్ను చాలా బాధించింది. ఇలా కరోనా సోకిన వారు తమ కుటుంబాలకు దూరంగా ఆసుపత్రుల్లో ఒంటరిగా ఉండటాన్ని అసలు ఊహించుకోలేము. ప్రతి రోజు కరోనాకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వినాల్సి వస్తుందనే భయం రోజు ఉంటుంది అని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.

సానియా మీర్జా కోవిడ్ పాజిటివ్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts