మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. `సర్కారు వారి పాట` షూటింగ్ షురూ!

January 25, 2021 at 11:23 am

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వ‌హించ‌నున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఎప్ప‌టి నుంచో వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు ప్రారంభ‌మైంది. ఈ సినిమా షూటింగ్ ఈరోజు దుబాయ్‌లో స్టార్ట్ అయ్యింది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తూ.. `ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్` అన్న క్యాప్షన్ తో ఓ చిన్న వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ యూనిట్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

దీంతో మ‌హేష్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా షూటింగ్‌ను దాదాపు 20 రోజుల పాటు దుబాయ్‌లోనే జ‌ర‌గ‌నుంది. దుబాయ్‌లో 20 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుంది.

మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. `సర్కారు వారి పాట` షూటింగ్ షురూ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts