తన డాన్స్ వీడియోను షేర్ చేసిన సయేషా సైగల్..!!

January 16, 2021 at 4:05 pm

హీరోయిన్ సయాషా సైగల్‌ తాజాగా తాను డ్యాన్స్‌ చేస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉండే సయాషా సైగల్ తనకు నచ్చిన ప్రతిదాన్ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అక్కినేని హీరో అఖిల్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సయేషా సైగల్​. తాజాగా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి మూవీలో హీరోయిన్ గా నటించనుంది. అప్పట్లోనే ఆమెను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం కూడా ప్రకటించింది.

#బీబీ3 టీమ్​తో పని చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సయేషా కూడా తెలిపింది. ఇంకా ఇటీవలే ప్రగ్యా జైశ్వాల్ మరో హీరోయిన్ గా నటించనుందని ప్రకటించారు మూవీ యూనిట్. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తుండగా, మిర్యాల రవీందర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే వేసవిలో థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మూవీ బృందం ప్లాన్ చేస్తున్నారు.

తన డాన్స్ వీడియోను షేర్ చేసిన సయేషా సైగల్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts