
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం `క్రాక్` సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం రవితేజకు జోడీగా శ్రుతి హాసన్ నటించింది. ఇక వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న రవితేజ క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు.
ఇక ఈ చిత్రం తర్వాత రమేశ్ వర్మ డైరెక్షన్లో `ఖిలాడి` సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఖిలాడి తర్వాత రవితేజ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. సూపర్ హిట్ చిత్రం `రాజాదిగ్రేట్` సినిమాకు సీక్వెల్ చేయాలని రవితేజ భావిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రవితేజకు మంచి హిట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్కెల్ చేసేందుకు రవితేజ ఆసక్తి చూపుతున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రస్తుతం ‘ఎఫ్ 2’ సినిమాకి సీక్వెల్ చేస్తున్న అనిల్ రావిపూడి రవితేజతో ‘రాజా ది గ్రేట్’కి సీక్వెల్ సినిమా చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.