షాహిద్ కపూర్ ‘జెర్సీ’ విడుదల అప్పుడేనట …!?

January 17, 2021 at 1:40 pm

టాలీవుడ్ లో క్రికెట్ నేపథ్యంలో వచ్చిన జెర్సీ మూవీ నాని కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఒకటి. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ జెర్సీ రీమేక్‌కు తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీలోనూ వహిస్తున్నారు. దిల్ రాజు, గీతా ఆర్ట్స్, అమన్ గిల్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మృణాల్‌ ఠాకూర్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 5 న, 2021 విడుదల చేయనున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కబీర్‌ సింగ్ సక్సెస్‌తో క్రేజ్ సంపాదించిన షాహిద్‌ కపూర్. ఇప్పుడు మరో తెలుగు చిత్రం జెర్సీ హిందీ రీమేక్‌లోను నటిస్తున్నాడు. షాహిద్ జెర్సీ కథకి బాగా కనెక్ట్ అయ్యి, మూవీ షూటింగ్ సెట్స్ లో చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాడు.

షాహిద్ కపూర్ ‘జెర్సీ’ విడుదల అప్పుడేనట …!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts